---Advertisement---

నేటి నుంచే ఐపీఎల్ 2026 ప్రారంభం..కొత్త సీజన్‌లో ఇవి తెలుసుకోవాల్సిందే

March 28, 2026

---Advertisement---

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 నేటి నుంచే ప్రారంభమవుతోంది. 19వ సీజన్‌గా ప్రారంభమవుతున్న ఈ టోర్నీ బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. దాదాపు 2 నెలల పాటు అభిమానులను అలరించనున్న ఈ లీగ్ మే 31న ఫైనల్‌తో ముగియనుంది.

లీగ్ ఫార్మాట్, మ్యాచ్‌ల వివరాలు

ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశలో టాప్ 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 తర్వాత ఫైనల్ జరుగుతుంది.

ఓపెనింగ్ సెర్మనీ రద్దు

ఈసారి ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఉండవు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

10 జట్లకు భారత కెప్టెన్లు

ఈ సీజన్‌లో ప్రత్యేకత ఏమిటంటే అన్ని 10 జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి కావడం విశేషం. గాయాల కారణంగా కొన్ని జట్లలో తాత్కాలిక మార్పులు చోటుచేసుకున్నాయి.

300 పరుగుల మైలురాయి చేరుతుందా?

గత 2 సీజన్లుగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 200 స్కోరు సాధారణమైపోయింది. 250 పైగా స్కోర్లు కూడా అనేక మ్యాచ్‌ల్లో వచ్చాయి. ప్రస్తుతం అత్యధిక స్కోరు 287. ఈ సీజన్‌లో 300 పరుగుల మార్క్ దాటుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ధోనీకి చివరి సీజనా?

సీఎస్కే స్టార్ ఆటగాడు ఎం ఎస్ ధోనీకి ఇది చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. గత కొన్నేళ్లుగా ఇదే వార్తలు వచ్చినా ఈసారి మాత్రం నిజం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అభిమానులు అతని ఆటను చివరిసారిగా చూడాలని ఆసక్తిగా ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment