ఇరాన్–ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు (Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణం తర్వాత రెండు దేశాల మధ్య వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ (Israel) ప్రధాని (Prime Minister)బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిపినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
నెతన్యాహూ పరిస్థితిపై స్పష్టత లేకపోవడం
తాజా ప్రకటనలో నెతన్యాహూ కార్యాలయంతో పాటు ఇజ్రాయెల్ వైమానిక దళాధిపతి ఉన్న ప్రాంతాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నామని IRGC వెల్లడించింది. ఇది వ్యూహాత్మకంగా చేపట్టిన దాడి అని పేర్కొంది. దాడి అనంతరం ప్రధాని నెతన్యాహూ పరిస్థితిపై స్పష్టత లేదని ఇరాన్ టైమ్స్ పేర్కొనగా, దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు, లెబనాన్ (Lebanon) రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడి నిర్వహించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వెల్లడించింది. బీరూట్‌లోని కీలక ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు IDF తెలిపింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయ సమాజం పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.






