అంతరిక్ష రంగంపై (Space Sector) ఆసక్తి ఉన్న విద్యార్థులకు (Students) ఇస్రో (ISRO) అదిరిపోయే అవకాశం ఇచ్చింది. పాఠశాల స్థాయి నుంచే యువ శాస్త్రవేత్తలను తయారు చేయడానికి యువిక 2026 (YUVIKA 2026 కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై ప్రాథమిక అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
9వ తరగతి విద్యార్థులకు స్పెషల్ అవకాశం
ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు (9th Class Students) మాత్రమే ఈ కార్యక్రమానికి అప్లై చేయవచ్చు. ఎంపికైన వారికి మే 11 నుండి మే 22 వరకు ఇస్రో కేంద్రాల్లో నిపుణుల (ISRO Centres Experts) ద్వారా ప్రత్యక్ష శిక్షణ అందుతుంది. ప్రయాణం, వసతి, భోజనం వంటి అన్ని ఖర్చులను ఇస్రోనే భరిస్తుంది.
ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ మార్చి 31, 2026గా నిర్ణయించారు. విద్యార్థుల ఎంపికలో 8వ తరగతి మార్కులతో పాటు ఆన్లైన్ పరీక్షలు, సైన్స్ ప్రదర్శనలు, ఒలింపియాడ్స్, క్రీడల్లో ప్రతిభను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అదనపు వెయిటేజీ కల్పించడం విశేషం. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
దేశ భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






