---Advertisement---

సామాన్యులపై జనసేన ప్రజాప్రతినిధుల వరుస దాడులు దేనికి సంకేతం?

April 3, 2026

---Advertisement---

ఎన్నికల ముందు మహిళా భద్రతకు (Women Safety) ప్రాధాన్యం ఇస్తామని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను (Law and Order) అత్యున్నత స్థాయిలో అమలు చేస్తామని హామీలు ఇచ్చిన జనసేన పార్టీ (Jana Sena Party), అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా జనసేన నాయకులు సామాన్య ప్రజలపై (Common People) భౌతిక దాడుల (Physical Attacks) ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుండి స్పష్టమైన స్పందన రాకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

రైల్వేకోడూరు ఘటనలో అరవ శ్రీధర్ (Arava Sridhar) భాదితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ సాక్ష్యాలు సమర్పించినప్పటికీ, ఆమెపై జనసేనలోనే మరొక నాయకుడు తాతంశెట్టి నరేంద్రచే (Tatamshetty Narendra) దాడి చేయించారన్న ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల సమక్షంలోనే మహిళపై దాడి జరగడం, దీనిపై తక్షణ చర్యలు లేకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు కారణమవుతోంది.

ఇక గతంలో కూడా పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు దాడులు, అనుచిత ప్రవర్తన, మరియు వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు మోసపూరితమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మహిళా రక్షణపై నాయకత్వం ఎందుకు మౌనం పాటిస్తోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనసేనపై కాపు సామాజికవర్గంలోనే నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment