---Advertisement---

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందుకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

February 3, 2026

---Advertisement---

రాష్ట్రవ్యాప్తంగా రైల్వే కోడూరు (Railway Koduru) జనసేన ఎమ్మెల్యే(JanaSena MLA) అరవ శ్రీధర్ (Arav Sridhar) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈరోజు జనసేన క్రమశిక్షణ కమిటీ (JanaSena Disciplinary Committee) ముందు హాజరుకానున్నారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ విచారణలో త్రిసభ్య కమిటీ శ్రీధర్ నుంచి వివరణ తీసుకోనుంది.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కమిటీ కేవలం ఆయన వాదన మాత్రమే కాకుండా, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను కూడా సేకరించనుంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “అందరి చిట్టా నా దగ్గర ఉంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపల తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. విచారణ నివేదికను సిద్ధం చేయాలని నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)కు బాధ్యతలు అప్పగించిన పవన్, అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయినట్లు సమాచారం.

వాస్తవానికి అరవ శ్రీధర్‌కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చి చాలాకాలం అవుతున్నా, ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఆగ్రహావేశం వ్యక్తం చేసిన మరుసటి రోజే శ్రీధర్ కమిటీ ముందు హాజరవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా, వీణ అనే మహిళ యువ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసింది. అరవ శ్రీధర్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, భర్తకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా, తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించాడని కూడా ఆమె చెప్పింది. ఈ క్రమంలో శ్రీధర్‌తో జరిగిన వీడియో కాల్స్, చాటింగ్ వివరాలను, మెడికల్ రిపొర్ట్స్ ఆమె బయటపెడుతుండటంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు, అసెంబ్లీ లోపల కూడా అరవ శ్రీధర్ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడిన దృశ్యాలు బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది.

ఈ వ్యవహారంపై జనసేన క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయం ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎమ్మెల్యే వ్యవహారం పవన్ కళ్యాణ్ కి ముందే తెలిసినా భాదితురాలి పక్షం లేకుండా ఉన్నారని, ఆమే సాక్ష్యాలతో మీడియాలోకి ఎక్కడంతో తప్పక దీనిమీద స్పందిస్తున్నారనే విమర్శ కూదా ఆయనపై ఉంది. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆశక్తిగా మారిన అంశం

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment