---Advertisement---

ఏపీ హైకోర్టులో కొత్త న్యాయమూర్తి.. జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం

March 13, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త న్యాయమూర్తిగా లిసా గిల్‌ (Lisa Gill) ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్ ఠాకుర్ (Dhiraj Singh Thakur) ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకం న్యాయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర?

ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ అనంతరం జస్టిస్ లిసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని న్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అలా జరిగితే ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచే అవకాశం ఉంది. న్యాయరంగంలో ఆమెకు ఉన్న అనుభవం, సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలు అప్పగించే అవకాశముందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment