రాజ్యసభలో తన తొలి ప్రసంగంతోనే మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. శ్రీశ్రీ కవిత జగన్నాథ రథచక్రాలు (Jagannatha Rathachakralu) వస్తున్నయ్ అంటూ, తెలుగు వాళ్లకి దాని అర్థం తెలుసునంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో (Parliamentary Democracy) ఎవరూ శాశ్వతం కాదని ఆయన సంకేతాత్మకంగా గుర్తు చేశారు. జెన్ జెడ్ కదులుతోందని, మార్పు తప్పదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తమిళ భాష (Tamil language)పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గతంలో చేసిన వ్యాఖ్యలపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ, తమిళం తన చరిత్రలో ఎప్పుడూ భిక్షాటనకో దొంగతనానికో ఉపయోగపడలేదని స్పష్టం చేశారు. భిక్షాటన చేయడానికి ఇతర భాషలు ఉపయోగపడవచ్చేమోగానీ, ఒక తమిళుడు దయను కూడా అంగీకరించడని ఆయన వ్యాఖ్యానించారు. ఒక తమిళుడిగా తన ఓట్లను గానీ, తన దేశాన్ని గానీ ఎప్పటికీ అమ్ముకోనని స్పష్టంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పార్లమెంట్లో మాటల యుద్ధానికి దారితీస్తూ, రాజకీయంగా మరింత ఉత్కంఠను రేకెత్తించాయి.








