---Advertisement---

కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌పై కవితకు హైకోర్టు ఊరట.. ఈసీకి కీలక ఆదేశాలు

March 19, 2026

---Advertisement---

కొత్త రాజకీయ పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు (Kalvakuntla Kavitha) హైకోర్టులో (High Court) ఊరట లభించింది. తెలంగాణ ప్రజా జాగృతి (Telangana Praja Jagruti) పేరుతో పార్టీ నమోదు కోసం చేసిన దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

జాప్యంపై కోర్టు స్పందన

పార్టీ నమోదు (Party Registration) ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందని పేర్కొంటూ కవిత కోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి (Election Commission) స్పష్టం చేసింది.

ఇప్పటికే దరఖాస్తులో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి మళ్లీ సమర్పించినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ఎన్నికల సంఘం నుంచి హామీ రావడంతో కోర్టు ఈ కేసు విచారణను ముగించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment