---Advertisement---

లోకేష్ క్రెడిట్ చోరీ వ్యాఖ్యలు – బూమరాంగ్ కానున్నాయా?

March 29, 2026

---Advertisement---

దశాబ్దాలుగా చంద్రబాబు (Nara Chandrababu Naidu) అండ్ కో చేస్తూ వచ్చిన క్రెడిట్ ప్రచారాలకు ప్రస్తుత కాలంలో తీవ్ర ఎదురుగాలి వీస్తుందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసహనంలో ఉన్నట్టు నేడు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. “ఈ మధ్య జగన్‌ (YS Jagan Mohan Reddyను చూస్తుంటే బాధేస్తోంది. ఆయనకు క్రెడిట్ చోరీ (Credit Theft) వ్యాధి వచ్చింది. జగన్ ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను” అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా సెల్ఫ్ గోల్‌గా (Self Goal) మారాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

నిజానికి రాజకీయాల్లో ఈ “క్రెడిట్ చోరీ” (Credit Theft) ఆరోపణలు ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడు పైనే వస్తుంటాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను చూపిస్తున్నారు. దేశంలో యూనివర్సిటీలో (University) చదువుతున్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి నేనేనని చంద్రబాబు చెప్పుకున్నారు. అయితే ఆయనకు ముందే లాలు ప్రసాద్ యాదవ్ పాట్నా విశ్వవిద్యాలయం (Lalu Prasad Yadav Patna University) నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగి 1977లో లోక్‌సభకు (Lok Sabha) ఎన్నికయ్యారు. ఇది క్రెడిట్ చోరీ కాదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

టోల్ గేట్లను నేనే తీసుకువచ్చానని చంద్రబాబు చెప్పగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పార్లమెంట్‌లో “ఈ దేశంలో టోల్ విధానాన్ని ప్రారంభించింది నేనే” అని స్పష్టం చేశారు. ఇది కూడా వివాదానికి దారి తీసింది. డీఎన్‌ఏ టెక్నాలజీని (DNA Technology) నేనే తీసుకువచ్చానని చెప్పినా, ఆ రంగంలో పితామహుడిగా లాల్ జీ సింగ్ పేరును చరిత్ర చెబుతోంది.

డ్వాక్రా పథకాన్ని (DWCRA Scheme) ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రారంభించగా, దానిని నేనే ప్రారంభించానని చెప్పడం కూడా విమర్శలకు కారణమైంది. హైటెక్ సిటీ శంకుస్థాపనను నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి చేసినప్పటికీ, దాన్ని తన “బ్రెయిన్ చైల్డ్” (Brain Child)గా చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో ప్రారంభమై పూర్తయ్యాయని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి.

సెల్‌ఫోన్‌ను నేనే తెచ్చానని చెప్పినా, 1995లో జ్యోతి బసు దేశంలో తొలి మొబైల్ కాల్ చేసి టెలికాం విప్లవానికి నాంది పలికారని చెబుతున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ప్రతిపాదించింది ములాయం సింగ్ యాదవ్ అయినప్పటికీ, దానిలో తన పాత్రను చంద్రబాబు అతిశయంగా చెప్పుకున్నారని విమర్శలు ఉన్నాయి. బాగా చదువుకోవాలని యువతకి నేనే చెప్పాను అన్నారు. కానీ ఇదే చంద్రబాబు గారు విద్య ప్రభుత్వ భాధ్యత కాదని కూడా అన్నారు. ఇది క్రెడిట్ చోరీ వ్యాదిలో భాగం కాదా అంటూన్నారు ప్రతిపక్ష సభ్యులు.

అలాగే ఎన్.టి.రామారావు గారు కూడా తన శ్రమదానం కార్యక్రమాన్ని చంద్రబాబు కాపీ చేశారని గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల జగన్ ప్రభుత్వం అమలు చేసిన “అమ్మఒడి” పథకాన్ని కూడా లోకేష్ ఆలోచనగా చెప్పడం మరో వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో, గతంలో నేదురుమల్లి నుంచి నేటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు అనేక ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ తీసుకున్నారనే విమర్శల మధ్య, అదే ఆరోపణను జగన్‌పై మోపడం లోకేష్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆదాని డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, పొట్టి శ్రీరాములు నెల్లురు జిల్లాగా నేనే పేరు పెట్టా అని చెప్పడం, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్టుల విషయంలో నిజాలు బయటపెట్టడం ద్వారా చంద్రబాబు పాత్ర ఎంతవరకు ఉందో ప్రజలకు స్పష్టమైందని అంటున్నారు. దీంతో టీడీపీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందని భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి, లోకేష్ చేసిన “క్రెడిట్ చోరీ” వ్యాఖ్యలు తిరిగి తమపైనే బూమరాంగ్ అవుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment