---Advertisement---

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం…

March 9, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) మంగళగిరి (Mangalagiri) ఎయిమ్స్‌లో (AIIMS – All India Institute of Medical Sciences) ఆకస్మికంగా డయేరియా (Diarrhea) కలకలం రేగింది. హాస్టల్‌లో (Hostel) ఉన్న వైద్య విద్యార్థులు (Medical Students) మరియు సిబ్బంది గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 25 మంది విద్యార్థులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఎయిమ్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. డయేరియా వ్యాప్తికి అసలు కారణం ఏమిటన్న దానిపై ఇప్పటికే విచారణ ప్రారంభించారు అధికారులు. ముఖ్యంగా తాగునీటి కాలుష్యమే (Drinking Water Contamination) కారణమా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. హాస్టల్‌ ప్రాంతం మరియు నీటి కుళాయిల నుంచి సుమారు 40 నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. వాటి నివేదికలు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే కేవలం పది రోజుల క్రితమే మున్సిపాలిటీల్లో డయేరియా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు కలుషితం కాని సురక్షితమైన తాగునీరు అందించేలా మున్సిపల్ శాఖ ప్రత్యేక ఎస్వోపీ కూడా విడుదల చేసింది. తాగునీరు కలుషితమైతే సంబంధిత మున్సిపల్ కమిషనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. పైపులైన్లను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చింది.

అయితే ప్రభుత్వం నుంచి వరుసగా ఆదేశాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట డయేరియా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డయేరియా కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని, అయినా సమస్యపై సమగ్ర చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లోనే డయేరియా ఘటన వెలుగులోకి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇక మరోవైపు, ఎయిమ్స్‌ వంటి ప్రముఖ వైద్య సంస్థలోనే విద్యార్థులు మరియు సిబ్బంది మూడు రోజులుగా డయేరియాతో ఇబ్బందులు పడుతుండగా, ఆ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్న నారా లోకేష్(Nara Lokesh) పరిస్థితిపై సమీక్షలు నిర్వహించకుండా క్రికెట్ మ్యాచ్‌కు (Cricket Match) వెళ్లడం బాధ్యతారాహిత్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో తాగునీటి భద్రతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment