---Advertisement---

“మావిగన్” ముందు తేలిపోతున్న కూటమి వాదన ?

April 9, 2026

---Advertisement---

రాష్ట్ర రాజకీయాల్లో మావిగన్ (Mavigan) ప్రతిపాదన చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రతిపాదనపై సమగ్ర చర్చ జరగాల్సిన సమయంలో, దానిని ట్రోలింగ్‌తో పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం (Telugu Desam Party), జనసేన (Jana Sena Party అనుచరుల సోషల్ మీడియా వేదికలలో ఈ అంశాన్ని తేలికగా తీసుకునే ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.

2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో మావిగన్ ఆలోచన ఎందుకు ముందుకు రాలేదనే ప్రశ్నను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో దీనికి బలమైన కౌంటర్లు వస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి భారీ ఖర్చులు అవసరమవుతాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం, కర్నూలు వంటి ప్రాంతాలతో సమతుల అభివృద్ధి సాధ్యమని జగన్ (YS Jagan) ప్రతిపాదించారు. అయితే ఆ విధానాన్ని కోర్టు కేసులు, రాజకీయ అడ్డంకులు కారణంగా అమలు చేయలేకపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఇక అమరావతిని రాజధానిగా (Amaravati Capital) కొనసాగించడంపై అభ్యంతరం లేకపోయినా, కోర్ క్యాపిటల్‌ను (Core Capital) 29 గ్రామాల పరిధిలో కాకుండా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మావిగన్ కారిడార్‌లో (Mavigan Corridor) అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని జగన్ వివరించారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి 20–30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని కూటమి పార్టీల నాయకులే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇదే సమయంలో, గతంలో 33 వేల ఎకరాలతో ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తామని చెప్పిన కూటమి నాయకులు, ఇప్పుడు అదే భూమితో కేవలం మునిసిపాలిటీ స్థాయిలోనే అభివృద్ధి సాధ్యమని చెప్పడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విరుద్ధ వ్యాఖ్యలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక మాట మార్చి రెండో విడత భూసేకరణకి వెళీతే తప్పు లేనప్పుడు అది మరింత భారమని జగన్ మరో ప్రతిపాధన ముందుకు తీసుకుని రావడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, రాజకీయ పార్టీలు కొత్త ప్రతిపాదనలు చేయడం సహజమే అయినప్పటికీ, వాటి ద్వారా రాష్ట్రానికి కలిగే లాభనష్టాలను విశ్లేషించడం అవసరం. భారీ వ్యయభారం పడే ప్రాజెక్టుల కంటే, తక్కువ ఖర్చుతో త్వరగా ఫలితాలు ఇచ్చే మార్గాలపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం మేధావుల నుంచి వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment