---Advertisement---

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మలుపుతిప్పే ఆర్థిక కారిడార్ – ‘మావిగన్’

April 3, 2026

---Advertisement---

నేటి ఆదునిక ప్రపంచంలో పట్టణీకరణ ఒక నగర పరిమితిని దాటి ‘మెగా-రీజియన్’ (Mega-Region) స్థాయికి ఎదుగుతున్న కీలక ధోరణిగా మారింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతిపక్ష నేత జగన్ (Jagan) ప్రతిపాదించబడిన ‘మావిగన్’(MAVIGAN) (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) కారిడార్ ఒక కొత్త ఆర్థిక వ్యూహంగా నిలుస్తోంది. అమరావతి (Amaravati) వంటి ఒకే నగరంపై అధికంగా పెట్టుబడులు పెట్టడం కంటే, ఇప్పటికే ఉన్న మూడు ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ అభివృద్ధిని విస్తరించడం ద్వారా సమగ్ర రాష్ట్రాభివృద్ధిని సాధించవచ్చనే భావన ఈ ప్రణాళికలో స్పష్టంగా ఉందని నిపుణులు చెబుతున్న మాట.

ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కారిడార్ నమూనాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. చైనాలోని (China) జెంగ్-జిన్-జి మెగా రీజియన్ (బీజింగ్, తియాంజిన్, హెబీ) ప్రాంతాలను కలుపుతూ అభివృద్ధిని వికేంద్రీకరించగా (Decentralization), అమెరికాలో (United States) బోస్-వాష్ కారిడార్ (బోస్టన్ నుండి వాషింగ్టన్) వరకు విస్తరించిన భారీ పట్టణ సముదాయంగా నిలిచింది. అలాగే చి-పిట్స్ వంటి ప్రాంతాలు కూడా నగరాల అనుసంధానంతో ఆర్థిక పురోగతికి దోహదపడ్డాయి. ఇదే తరహాలో మావిగన్ కూడా అంతర్జాతీయ నామకరణ పద్ధతిని అనుసరించి జగన్ ప్రతిపాదన చేసి ఉండవచ్చు అని అభిప్రాయన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు.

మావిగన్ ప్రణాళిక ద్వారా పరిశ్రమలు, మానవ వనరులు మరియు మౌలిక సదుపాయాలు ఒకే ఆర్థిక వలయంలో చేరి ‘అగ్లోమరేషన్ ఎకానమీస్’ (Agglomeration Economies) ను పెంచే అవకాశం ఉంది. దీని వల్ల ఖర్చులు తగ్గి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ప్రాంతీయ సమతుల్యత సాధ్యమవుతుంది, ఎందుకంటే అభివృద్ధి ఒకే నగరంలో కాకుండా పలు ప్రాంతాలకు విస్తరిస్తుంది.

మౌలిక సదుపాయాల పరంగా కూడా ఈ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్లు, రైల్వేలు, పోర్టులు విమానాశ్రయాల అనుసంధానం ద్వారా రవాణా వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. బిఆర్టి వంటి ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగలవు. అదనంగా, మలేషియాలోని ఇస్కందర్ కారిడార్ తరహాలో ప్రత్యేక ఆర్థిక మండలంగా అభివృద్ధి చేస్తే విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది.

మొత్తానికి, మావిగన్ ప్రణాళిక కేవలం రాజకీయ చర్చ కాదు; అది స్థిరమైన పట్టణాభివృద్ధి మరియు ఆర్థిక వికాసానికి దారితీసే ఒక వ్యూహాత్మక దిశ అని చెప్పవచ్చు. నగరాల మధ్య సమన్వయం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును (Andhra Pradesh Future) కొత్త దిశలో నడిపించే శక్తి ఈ ప్రణాళికలో దాగి ఉందని పలువురు ఆర్ధిక వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment