---Advertisement---

మధ్యాహ్న భోజన పధకంపై గరికిపాటి వారి వాఖ్యల దుమారం

March 19, 2026

---Advertisement---

భారతదేశంలో (India) మధ్యాహ్న భోజన పథకం (Midday Meal Scheme) విద్యార్థుల (Students) పోషకాహారం మరియు పాఠశాల హాజరు పెంపునకు కీలకంగా మారిన ఒక చారిత్రాత్మక కార్యక్రమం. 1980ల నాటికే తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala) వంటి రాష్ట్రాలు వండిన భోజనాన్ని విద్యార్థులకు అందించగా, 1995లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు (P. V. Narasimha Rao) గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2001లో సుప్రీం కోర్టు (Supreme Court of India) ఆదేశాలతో ఇది విద్యార్థుల హక్కుగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వైయస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) నాయకత్వంలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ ‘జగనన్న గోరుముద్ద’ (Jagananna Gorumudda) పథకం ప్రవేశపెట్టి, విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆ మేరకు అమలు చేసి సఫలీకృతం అయ్యారు.

అయితే, కూటమి పరిపాలనలో (Coalition Government) ఇటీవలి కాలంలో పాఠశాలల్లో ఈ పథకం అమలు విషయంలో నాణ్యత లోపాలపై (Quality Issues) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవడం, మైలవరం వంటి ప్రాంతాల్లో నిరసనలు జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మధ్యాహ్న భోజనం కారణంగా విద్యార్థులు చదువుపై (Studies) దృష్టి కోల్పోతున్నారని, పాఠశాలలో భోజనం అవసరమా అనే ప్రశ్నలు లేవనెత్తడం వివాదాస్పదంగా మారింది. ఆయన వ్యాఖ్యలను పేదల పట్ల వివక్షగా భావిస్తూ పలువురు విమర్శిస్తున్నారు.

ఇకపోతే, మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం ఆకలి నివారణతో పాటు విద్యకు ప్రోత్సాహం ఇవ్వడం కావడంతో, ఈ విధమైన వ్యాఖ్యలు సామాజికంగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఒకవైపు పథకం అవసరాన్ని సమర్థించే వాదనలు ఉండగా, మరోవైపు అమలు లోపాలపై విమర్శలు ఉంటే వాటిని సరిచేసుకోవాలే కానీ పధకాన్నే తప్పు పట్టడం సముచితం కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment