---Advertisement---

రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు.. కెప్టెన్లుగా లోకేష్, మనోహర్

February 23, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ వేదిక తర్వాత క్రీడా మైదానంలో హోరాహోరీ పోటీలు జరగబోతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలకు (MLCs) ప్రత్యేక క్రీడా పోటీలు (Special Sports Competitions) నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో (Indira Gandhi Municipal Stadium) ఈ కార్యక్రమం జరగనుంది.

శాసనసభా పక్ష కార్యాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సభ్యులు తమకు నచ్చిన క్రీడలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. క్రికెట్‌తో పాటు క్యారమ్స్, చెస్, టెన్నిస్ వంటి పలు ఆటలు నిర్వహించనున్నారు. పాల్గొనే సభ్యులకు ఉచితంగా టీషర్ట్, ట్రాకర్ కూడా అందించనున్నారు.

క్రికెట్ మ్యాచ్‌లపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. రెండు జట్లు ఏర్పాటు చేయగా ఒక జట్టుకు కెప్టెన్‌ (Captain)గా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), మరో జట్టుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సారథ్యం వహించనున్నారు. ఎక్కువ మంది సభ్యులు క్రికెట్‌కు ఆసక్తి చూపితే మూడో జట్టును ఏర్పాటు చేసి దానికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment