దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. 2047 నాటికి భారత్‌ను(India) వికసిత్ భారత్‌గా (Viksit Bharat) తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే నారీశక్తిని (Women Power) ప్రోత్సహించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం లక్ష్యం
మహిళా రిజర్వేషన్ బిల్లుపై (Women Reservation Bill) మాట్లాడుతూ, దేశంలో మహిళలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. 2029 లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల నాటికి లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో (Legislative Assemblies) మహిళలకు (Women) ముప్పై మూడు (33%) శాతం ప్రాతినిధ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ బిల్లుకు ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొన్నదని చెప్పారు. ప్రజలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని, తన ఆలోచనలను వివరించిన వ్యాసాన్ని చదవాలని కోరారు.
అంతేకాకుండా ప్రజలు అన్ని రాజకీయ పార్టీలను ప్రోత్సహించి ఈ బిల్లును ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఈ బిల్లును ఆమోదించి దేశానికి ఒక కీలక అడుగు ముందుకు వేయాలని మోడీ ఆకాంక్షించారు.






