నారాయణపేట జిల్లాలో (Narayanpet District) జరిగిన ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చదువు చెప్పాల్సిన గురువే మానవత్వం మరిచి ఓ మైనర్ విద్యార్థినిపై (Minor Student) లైంగిక దాడికి (Sexual Assault) పాల్పడిన విషయం బయటపడింది. మద్దూరు మండలం మోమినపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Mominpur Government High School) జరిగిన ఈ ఘటన తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.
20 లక్షలతో కేసు మూసివేత ప్రయత్నం
వివరాల ప్రకారం, స్వామి(Swamy) అనే ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినిపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించిన నిందితుడు, గ్రామ సర్పంచ్ భర్త రవి కుమార్ (Ravi Kumar) సహకారంతో బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసేందుకు ఏకంగా 20 లక్షల రూపాయల సెటిల్మెంట్‌కు (₹20 Lakhs Settlement) యత్నించినట్లు సమాచారం. అయితే డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
వీడియో లీక్‌తో బహిర్గతం
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో అసలు నిజం బయటపడింది. ఈ కేసులో మరికొందరు ఉపాధ్యాయులు కూడా సహకరించినట్లు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు, సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి మొత్తం 7 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు స్వామితో పాటు, సెటిల్మెంట్‌కు ప్రయత్నించిన రవి కుమార్, ఇతర సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుండగా, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.






