---Advertisement---

నా ఇన్‌స్టా నా ఈకే, కానీ నా తెలివి అంతకంటే పెద్దది – అన్వేష్ కౌంటర్

February 20, 2026

---Advertisement---

ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ వీడియోలతో గుర్తింపు పొందిన తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (‘Naa Anveshana’) (అన్వేష్) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను (Instagram Account) మెటా యాజమాన్యం (Meta Management) తొలగించడం పెద్ద సంచలనంగా మారింది. సుమారు 13 లక్షల ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా ఒక్కసారిగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రాసిన లేఖ ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. గతంలో అన్వేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న ఆరోపణలతో కేసు నమోదు కాగా, విచారణ అనంతరం ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ఖాతాను బ్యాన్ (Account Ban) చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై అన్వేష్ స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. “నా ఇన్‌స్టాగ్రామ్ పోతే ఏంటి? ఉంటే ఏంటి? అది నా ఈక లాంటిదే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు తన రెండు చేతుల్లాంటివని, రెండు యూట్యూబ్ ఛానల్లు తన రెండు కాళ్లంటూ, ఫేస్‌బుక్ తన శరీరం భాగమని పేర్కొన్నారు. ఇవన్నీ నడిపించేది తన తెలివైన బుర్ర అని చెప్పి విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా తాను ఆగబోనని స్పష్టం చేసిన అన్వేష్, యూట్యూబ్ ద్వారా నెలకు సుమారు రూ.8 లక్షల ఆదాయం వస్తుందని వెల్లడించారు. “ఒక ప్లాట్‌ఫామ్ తీసేస్తే ఇంకొకదానితో ముందుకు వెళ్తాను. నన్ను ఆపలేరు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో స్వేచ్ఛ, బాధ్యతలపై మళ్లీ చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment