---Advertisement---

ప్రేమ పేరుతో గిరిజన యువతి బిడ్డిక ఉషారాణిని హత్య చేసింది జనసేన కార్యకర్త.

June 14, 2026

---Advertisement---

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రూరల్ మండలంలో సంచలనం సృష్టించిన గిరిజన యువతి (Tribal Young Woman) బిడ్డిక ఉషారాణి (Biddika Usharani) హత్య కేసు పోలీసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఐదేళ్ల పాటు ప్రేమ పేరుతో సంబంధం కొనసాగించిన ప్రియుడు, పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆమెను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం, జంపరకోట పంచాయతీ బర్నసీతంపేట గ్రామానికి చెందిన ఉషారాణి గతంలో బర్న సీతంపేట గ్రామ వలంటీర్‌గా (Village Volunteer) పని చేసింది. ఆమేకు ఎం.సింగుపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త (Janasena Activist) రెడ్డి భువనేశ్వరకుమార్ (Reddy Bhuvaneshwar Kumar) అలియాస్ భువన్‌తో (Alias Bhuvan) ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ సమయంలో భువన్‌కు ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న కృపారాణితో కూడా సన్నిహిత సంబంధం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని ముగ్గురు కలిసి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.

స్టాఫ్ నర్సు కృపారాణి సూచన మేరకు నిద్రమాత్రలను డ్రింక్‌లో కలిపి ఉషారాణికి తాగించి స్పృహ కోల్పోయేలా చేసిన అనంతరం, భువన్ తన బంధువు సవిరిగాన తేజ సహాయంతో కారులో తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని దాచిపెట్టేందుకు పలుమార్లు ప్రదేశాలు మార్చి చివరకు తుమరాడ సమీపంలోని కామినాయుడు చెరువులో కాళ్లు, చేతులు కట్టి రాయి బిగించి పడేసినట్లు వెల్లడించారు.

ఉషారాణి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, చెరువులో లభించిన మృతదేహాన్ని ఆమెదేనని గుర్తించారు. కాల్ డేటా(Call Data), సాంకేతిక ఆధారాలు (Technical Evidence) మరియు అనుమానితుల కదలికలను విశ్లేషించిన పోలీసులు భువన్, కృపారాణి, తేజలను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment