రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, జాన్వి కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా, బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా (Peddi Movie) విడుదలపై (Release) వచ్చిన రూమర్లకు ఫుల్ స్టాప్ పడినట్లైంది. మొదట ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయాలని ప్రకటించగా, తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఇటీవల జూన్‌లో రిలీజ్ అవుతుందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షూటింగ్ ఫినిష్ దశలో.. ప్రకటించిన తేదీకే రిలీజ్
ఈ రూమర్లపై రామ్ చరణ్ తాజాగా స్పందిస్తూ కీలక అప్డేట్ ఇచ్చారు. సినిమా టాకీ పార్ట్ పూర్తైందని, ఇంకా ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్‌లో ఉందని తెలిపారు. ఆ పాట కూడా త్వరలో పూర్తి చేసి ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 30 తేదీకే సినిమాను విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, ఓవర్సీస్లో (Overseas) ఈ సినిమా బుకింగ్స్ (Movie Bookings) ఏప్రిల్ 8 నుంచి ఓపెన్ కానున్నట్లు సమాచారం. దీంతో పెద్ది సినిమా అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది.






