---Advertisement---

రాజమండ్రి కల్తీపాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధ్యులను విడిచిపెట్టొద్దని జగన్ డిమాండ్

February 23, 2026

---Advertisement---

రాజమండ్రిలో (Rajahmundry) కల్తీపాలు (Adulterated Milk) తాగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రజలు ఆరోగ్యానికి మంచిదని భావించే పాలే ప్రాణాంతకంగా మారడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకరమన్నారు.

ఆహార భద్రతలో నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment