మెగా పవర్ స్టార్ రామ్ (Ram Charan) చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న పెద్ది (Peddi) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతూ చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా ఘటన అభిమానుల్లో కలకలం రేపింది.
యాక్షన్ సీన్లో గాయం.. రెండు రోజుల విశ్రాంతి
హైదరాబాద్‌లో (Hyderabad) జరుగుతున్న షూటింగ్ సమయంలో కీలక యాక్షన్ సన్నివేశం (Action Sequence) చిత్రీకరిస్తుండగా రామ్ చరణ్‌కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. కంటి సమీపంలో గాయం కావడంతో అభిమానులు ఆందోళన చెందగా, ఇది పెద్ద ప్రమాదం కాదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించడంతో పాటు రెండు రోజుల పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీంతో స్వల్ప విరామం తర్వాత రామ్ చరణ్ తిరిగి షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక ప్రత్యేక పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ దాదాపుగా ముగియనుంది.
ఇక మరోవైపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీగా సంబరాలకు సిద్ధమవుతున్నారు. అదే రోజు సినిమా టీజర్ (Teaser) లేదా ప్రత్యేక దృశ్యాలు విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాయం వార్త అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగించినప్పటికీ, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.






