---Advertisement---

గంజాయి మత్తులో యువకుడు వీరంగం.

February 18, 2026

---Advertisement---

తిరుపతి (Tirupati) జిల్లాలోని రేణిగుంట (Renigunta) ప్రాంతంలో గంజాయి (Cannabis) మత్తులో ఓ యువకుడు కత్తితో (Knife) వీరంగం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తితో హల్‌చల్ చేస్తూ తనను తాను పొడుచుకుంటూ బీభత్సం సృష్టించిన అతను చివరికి రక్తసిక్తమైన స్థితిలో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పుతుండగా, స్థానికుల సహకారంతో పోలీసులు అతికష్టం మీద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో గంజాయి సమస్యపై మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన నేతలు ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గంజాయి విచ్చలవిడిగా తయారవుతూ, సేవించే వ్యక్తులు ఉన్మాదుల్లా ప్రవర్తించి హత్యలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలంటే గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment