---Advertisement---

అజిత్ పవార్ విమాన ప్రమాదం – రామ్ మోహన్ నాయుడుపై రోహిత్ పవార్ సంచలన ఆరోపణ

February 19, 2026

---Advertisement---

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర కర్జట్–జామ్‌ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదంలో తన పెదనాన్న, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.

ఘటనపై స్వతంత్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ విశ్వసనీయతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. విమానం ఆపరేటర్ అయిన వీఎస్ఆర్ ఏవిఏషన్ సంస్థతో కేంద్ర విమానయాన మంత్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

“వీఎస్ఆర్‌ ఏవిఏషన్ కు అధినేత అయిన వీకే సింగ్ కుమారుడు రోహిత్ సింగ్ ఏడాది క్రితం జైపూర్‌లో వివాహం చేసుకున్నారని. ఆ వివాహ వేడుకకు తెలుగుదేశం పార్టీలోని ముఖ్యనాయకులు హాజరయ్యారని. వీఎస్ఆర్‌కు, తెలుగుదేశం పార్టీకి మద్య ఉన్న ఈ సాన్నిహిత్యం దర్యాప్తు పారదర్శకతపై సందేహాలను కలిగిస్తోందని” రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు. కాబట్టి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని అభిప్రాయపడ్డారు.

రోహిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రమాదం వెనుక అసలు కారణాలేమిటి? దర్యాప్తు నిజంగా స్వతంత్రంగా జరుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు రాజీనామా చేస్తేనే దర్యాప్తుపై ప్రజలకి అజిత్ పవార్ అభిమానులకి ఒక నమ్మకం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు నుండి వినిపిస్తున్న మాట. కేంద్ర ప్రభుత్వం , తెలుగుదేశం ఈ వ్యవహారంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో అని అందరిలోను ఉత్కంఠ రేపుతుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment