---Advertisement---

సల్మాన్ సరసన నయనతార.. భారీ యాక్షన్ డ్రామాతో హాట్ కాంబినేషన్

March 31, 2026

---Advertisement---

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), నిర్మాత దిల్ రాజు (Dil Raju) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రానికి ఇప్పుడు కొత్త క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో సౌత్ స్టార్ నయనతార హీరోయిన్‌గా (Nayanthara) ఎంపిక కావడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

సల్మాన్ – నయన్ కాంబోపై భారీ అంచనాలు

జవాన్ సినిమా తర్వాత బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన నయనతార, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో జత కట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో, ఈ సినిమాలో కూడా నయనతార పాత్ర కీలకంగా ఉండబోతుందని సమాచారం. కథను మలుపు తిప్పేలా ఆమె పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment