---Advertisement---

Sanju Samson: సంజూ సూపర్ ఇన్నింగ్స్‌… సెమీస్‌ చేరిన టీమిండియా

March 2, 2026

---Advertisement---

భారత్‌కు (India) సెమీఫైనల్‌ అవకాశాలు దాదాపు నిలిచిపోయే స్థితిలో ఉన్న వేళ, సంజు శాంసన్అ (Sanju Samson)ద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి టాప్ ఫోర్‌లోకి చేర్చాడు. ఐసీసీ మెన్స్ టీ20 2026 (ICC Men’s T20 World Cup 2026)లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక పోరులో వెస్టిండీస్‌ (West Indies) పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్‌కు (Semi-Final) అర్హత సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఓపెనర్లు హోప్‌ (32), రోస్ట‌న్ చేజ్‌ (40) జాగ్రత్తగా ఆడుతూ మంచి ఆరంభం ఇచ్చారు. అయితే బూమ్రా కీలక సమయంలో షిమ్రోన్ హెట్‌మైర్ (27), రోస్టన్ చేజ్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. 102/2 నుంచి 119/4కు కుదేలైన వెస్టిండీస్‌ను పావెల్‌ (34) మరియు జాన్స‌న్ హొల్డ‌ర్‌ (37) వేగంగా ఆడుతూ 76 పరుగుల భాగస్వామ్యంతో పోరాటపటిమ చూపించారు.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. సంజు శాంసన్ మూడో ఓవర్లోనే అఖీల్ హొసేన్‌పై రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాదుతూ తన ఆట‌లో దూకుడు పెంచాడు. అయితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగా ఔటవడంతో భారత్ పవర్‌ప్లే ముగిసే సరికి 53/2 వద్ద నిలిచింది. ఆ తర్వాత శాంసన్ బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించాడు.

సంజు శాంస‌న్‌ 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. తన ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు, 4 సిక్సర్లు బాదిన శాంసన్ టీ20 వరల్డ్‌కప్ రన్‌చేజ్‌లో భారత ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌తో 58 పరుగుల భాగస్వామ్యం, తిలక్ వర్మతో 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించాడు. చివరికి విజయం కోసం కావాల్సిన పరుగును కూడా శాంసనే బౌండరీగా సాధించి భారత్‌ను 19.2 ఓవర్లలో 199/5కు చేర్చాడు.

ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో (England) తలపడనుంది. ముంబై వేదికగా జరగనున్న ఈ పోరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీలక సమయంలో శాంసన్ చూపించిన పట్టుదల భారత్‌కు విశ్వాసాన్ని పెంచింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment