---Advertisement---

శ్రీశైలంలో శివస్వాములపై లాఠీచార్జ్ – తీవ్ర ఉదృక్తత.

February 10, 2026

---Advertisement---

శ్రీశైలం(Srisailam)లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో (Maha Shivaratri Brahmotsavams) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్లికార్జున స్వామి (Mallikarjuna Swamy) దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన శివదీక్ష భక్తులు, ఆలయ సిబ్బంది నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుముడులు తలపై పెట్టుకుని క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులు గంటల తరబడి వేచిచూసినా సరైన ఏర్పాట్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచినీరు, భిక్ష, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా అందకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్లలో 12 గంటలకు పైగా నిలబడాల్సి వచ్చిందని, ఈ సమయంలో వీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో కొందరు భక్తులు బారికేడ్లను తోసివేసి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగా, ఒక్కసారిగా వందలాది మంది రావడంతో భద్రతా వ్యవస్థ కుదేలైంది.

ఈ క్రమంలో పోలీసుల జోక్యం ఉద్రిక్తతను మరింత పెంచింది. శివస్వాములపై లాఠీ చార్జ్ (Lathi Charge) కి దిగడంతో భక్తులు ఆగ్రహించి నిరసనకు దిగారు. ఆలయ రాజగోపురం ఎదుట బైఠాయించి అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈవోకి వ్యతిరేకంగా పెద్ద ఏత్తున నినాదాలు చేశారు.

భక్తుల రాకను ముందుగానే అంచనా వేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల, సింహాచలం, శ్రీశైలం లాంటి ప్రముఖ దేవస్థానాల్లో సైతం వరుసగా జరుగుతున్న నిర్లక్ష్య ఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని భక్తులు వాపోతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment