---Advertisement---

“పోలీసమ్మ నీకు సెల్యూట్”.. సహచరులకే ఉరిశిక్ష పడేలా చేసిన ధైర్యవంతురాలు రేవతి

April 7, 2026

---Advertisement---

తమిళనాడులో సంచలనం సృష్టించిన సాత్తాన్‌కుళం లాకప్ మరణాల కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తండ్రి, కొడుకును లాకప్‌లో చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ మదురై కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిజాలను బయటపెట్టిన హెడ్ కానిస్టేబుల్ రేవతి పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నిజం కోసం పోరాడిన రేవతి.. కేసు మలుపు తిప్పిన సాక్ష్యాలు

ఈ ఘటన జరిగిన వెంటనే నిజాలు బయటకు రాకుండా ఉండాలని కొందరు పోలీసులు ప్రయత్నించారు. సాక్ష్యాలను తొలగించి కథను మార్చే ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మౌనం పాటిస్తారు. కానీ రేవతి మాత్రం అలా చేయలేదు. తన కళ్ల ముందే జరిగిన దారుణానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది.

తోటి సిబ్బంది ఒత్తిడి, ఉన్నతాధికారుల ఆంక్షలు ఉన్నప్పటికీ రేవతి వెనుకడుగు వేయలేదు. మేజిస్ట్రేట్ ముందు ఆమె చెప్పిన వివరాలు కేసుకు కీలక మలుపు తిప్పాయి. స్టేషన్‌ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిన రక్తపు మరకలను గుర్తించి చూపించడం ద్వారా నిందితులపై బలమైన ఆధారాలు సమర్పించింది.

సీసీటీవీ ఆధారాలు లేకపోయినా, తన జ్ఞాపకశక్తితో సంఘటనల క్రమాన్ని స్పష్టంగా వివరించడం ద్వారా దర్యాప్తుకు మార్గదర్శకురాలిగా నిలిచింది. ఒక పోలీస్ అధికారిణిగా ఉండి, న్యాయం కోసం పోలీసులకే వ్యతిరేకంగా నిలబడడం అరుదైన విషయం. చివరకు బాధితులకు న్యాయం జరిగేలా చేసిన రేవతి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment