---Advertisement---

ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందా? టీడీపీ–జనసేన ప్రభుత్వానికి ఎదురవుతున్న అసలు సవాల్‌

February 4, 2026

---Advertisement---

టీడీపీ–జనసేన కూటమి (TDP–Jana Sena Alliance) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల్లో ఆశలు నెరవేరకపోవడం, విధాన నిర్ణయాల్లో స్పష్టత లోపించడం వల్ల ప్రజా అసంతృప్తి క్రమంగా తీవ్రమవుతున్నదనే అభిప్రాయం బలపడుతోంది. అధికారంలోకి వస్తే గత ప్రభుత్వాల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలు చేస్తామని, అభివృద్ధి ద్వారా సంపద సృష్టిస్తామని చేసిన హామీలు ఆచరణలో కనిపించకపోవడం ప్రభుత్వంపై విమర్శలకు దారి తీసింది.

ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపునకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు, ప్రజల సమస్యలను పక్కన పెట్టారన్న భావన ప్రజల్లో నెలకొంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్‌(Jagan)పై ఆరోపణలు మోపుతున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశం (Medical Colleges Privatization Issue), రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ (Rayalaseema Lift Irrigation Project), తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy), ఎమ్మెల్యేలపై వచ్చిన అక్రమ సంభందాల ఆరోపణలు, గీతం భూకేటాయింపులు, నందమూరి తారకరామారావు విగ్రహానికి సంబంధించిన వివాదం వంటి ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను ప్రజల్లో మరింత దెబ్బతీశాయి. ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు, గృహదహనాల ఘటనలు చోటుచేసుకోవడం వల్ల కూటమి ప్రభుత్వం గాడి తప్పిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది.

ఇంత తక్కువ కాలంలోనే ఇంత విస్తృత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం అరుదేనన్న భావన కూడా సామాన్య ప్రజల్లోనూ, రాజకీయ విశ్లేషకులలోనూ చర్చకు వస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment