---Advertisement---

నాడు టికెట్ కోసం ప్రాణాలకే తెగించిన టీడీపీ నేతకు ఇప్పుడు కేసులతో వేదింపులు ?

June 13, 2026

---Advertisement---

కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడ్డ నేతలపైనే వేదింపులు (Harassment) జరుగుతున్నాయనే ప్రచారం తెలుగుదేశం పార్టీ(TDP) వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి ఉదాహరణగా పార్టీ కోసం పనిచేసిన ఎన్నారై రావి మురళి (Ravi Murali) కాంప్లెక్స్‌ను (Complex) తెలుగుదేశం నేతలే కబ్జా (Encroachment) చేశారని ఆయన గతంలోనే బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం చర్చనీయాంశమైంది.

ఇదే తరహాలో తాజాగా నరసరావుపేటలో (Narasaraopet) మరో ఘటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరసరావుపేట టికెట్‌ను చదలవాడ అరవిందబాబుకు (Chadalawada Aravind Babu) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పులిమి రామిరెడ్డి (Pulimi Ramireddy) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన నాయకులు, కార్యకర్తలు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

అయితే ఇప్పుడు అదే పులిమి రామిరెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తనపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రోడ్డు సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున పోరాడుతున్న తమపై ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, రోడ్డుకు అభ్యంతరం తెలిపిన వ్యక్తి కుమారుడి ద్వారా లోకేష్(Nara Lokesh) కార్యాలయం నుంచి ఫోన్ చేయించి తనపై కేసులు పెట్టించారని ఆరోపించారు. “మేము నిజంగా అధికార పార్టీలో ఉన్నామో లేదో కూడా అర్థం కావడం లేదు. పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా స్వీకరించడం లేదు” అంటూ రామిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో పార్టీ కోసం పనిచేసిన నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా అనే చర్చ నరసరావుపేటతో పాటు రాజకీయ వర్గాల్లోనూ మొదలైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment