దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజాప్రతినిధుల డ్రగ్స్ పార్టీ (Drugs Party) ఘటనలో ఒక సిట్టింగ్ ఎంపీ పాల్గొన్నట్టు బయటపడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీకి Telugu Desam Party (TDP) చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ Putta Mahesh Kumar డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.
ప్రజల నమ్మకంతో ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి మాదకద్రవ్యాలు సేవించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
ఇంకా దేశ చరిత్రలో డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన తొలి ఎంపీగా(MP) నిలిచిన ఈ ఘటన తెలుగు ప్రజల ప్రతిష్టను (Telugu People Reputation) దేశవ్యాప్తంగా దెబ్బతీసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌పైనా ప్రతికూల ప్రభావం చూపిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) వెంటనే స్పందించి సంబంధిత ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవి నుండి అలాగే పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని (Should Suspend) కోరుతున్నారు.
అలా చేయడం ద్వారా మాత్రమే ఈ వివాదంపై కొంతమేర ఉపశమనం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేనిపక్షంలో ఈ డ్రగ్స్ వివాదం తెలుగుదేశం పార్టీకి పెద్ద మచ్చగా మారి పార్టీ ప్రతిష్టపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు కఠిన చర్యలకు దిగుతారా? లేక ఈ వివాదం ఇంకా రాజకీయ దుమారాన్ని రేపుతుందా? అనే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.






