---Advertisement---

డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీకి స్టేషన్ బెయిల్ – దేశవ్యాప్తంగా నెటిజన్లు ఫైర్!

March 16, 2026

---Advertisement---

మొయినాబాద్‌లో (Moinabad) వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో (Drugs Case) అరెస్టైన ఏలూరు ఎంపీ (Eluru MP), తెలుగుదేశం పార్టీ (TDP) నేత పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు (Putta Mahesh Kumar Yadav) స్టేషన్ బెయిల్ (Station Bail) మంజూరు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌కు హాజరు కావాల్సి ఉందనే కారణంతోనే పోలీసులు బెయిల్ ఇచ్చినట్లు సమాచారం వెలువడుతోంది. అయితే ప్రమాదకరమైన నిషేధిత మాదకద్రవ్యాలను వాడుతూ పట్టుబడ్డ ఒక ప్రజాప్రతినిధికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం సముచితమా అనే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. డ్రగ్స్ (Drugs) వాడుతూ పట్టుబడ్డ ప్రజాప్రతినిధిని సులభంగా విడిచిపెట్టడాన్ని అనేక మంది తప్పుబడుతున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రజల సమస్యలు ప్రస్తావించాల్సిన పార్లమెంట్ సభ్యుడు స్వయంగా చట్ట విరుద్ధ చర్యల్లో పట్టుబడితే ఆయన నైతిక అర్హత ఏమిటని అనేక మంది విమర్శిస్తున్నారు.

ఇది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టీవీ చానల్ జర్నలిస్టులు (TV Channel Journalists), ఇండిపెండెంట్ జర్నలిస్టులు (Independent Journalists) కూడా ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ వాడటం మాత్రమే కాకుండా పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో తుపాకీతో కాల్పులు జరిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి వ్యక్తి చట్ట సభల్లో కొనసాగడం సరైనదేనా అనే ప్రశ్నలు వారు లేవనెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో “సే నో టు డ్రగ్స్” (Say No To Drugs) అనే ప్రచారం కన్నా “ఏ తప్పు చేసినా సే యెస్ టు బెయిల్” అనే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న విమర్శలు, నిరసనల నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక ఎంపీపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం ఎలా స్పందించాలి అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. పలువురు రాజకీయ విశ్లేషకులు, ప్రజాభిప్రాయం ప్రకారం ఇటువంటి ఘటనలు ప్రజల్లో ప్రతికూల సందేశాన్ని పంపే అవకాశముందని పేర్కొంటున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఇది పార్టీ ప్రతిష్టపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment