తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల (Gaddar Film Awards) విజేతలను జ్యూరీ (Jury) అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఎన్టీఆర్ నేషనల్ అవార్డు (NTR National Award) దక్కగా, అక్కినేని నాగేశ్వరరావు అవార్డును (Akkineni Nageswara Rao Award) ప్రముఖ నటి జయసుధ అందుకోనున్నారు.
భట్టితో జ్యూరీ సభ్యుల భేటీ
అవార్డుల ప్రకటనకు ముందు జ్యూరీ సభ్యులు 2025 సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు (Telangana Deputy Chief Minister Bhatti Vikramarka) అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డుల ఎంపిక విధానం, అవార్డు వేడుక నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం జ్యూరీ చైర్మన్ మణిశర్మ (Mani Sharma) ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు.
2025 గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలు
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ఫ్రీ వెడ్డింగ్ షో
జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రం – తండేల్
ప్రత్యేక జ్యూరీ అవార్డులు
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
పైడి జైరాజ్ అవార్డు – కమల్ హాసన్
సినారే అవార్డు – సుద్దాల అశోక్ తేజ
రఘుపతి వెంకయ్య అవార్డు – రమేశ్ ప్రసాద్
అక్కినేని నాగేశ్వరరావు అవార్డు – జయసుధ
నాగిరెడ్డి–చక్రపాణి అవార్డు – అశ్వనీదత్
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు – సింగీతం శ్రీనివాసరావు
కాంతారావు అవార్డు – ఆర్ నారాయణమూర్తి
ఇతర విభాగాల్లో విజేతలు
ఉత్తమ సామాజిక సందేశం ఉన్న చిత్రం – కోర్ట్
ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ కొత్త దర్శకుడు (ఫీచర్ ఫిల్మ్) – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
ఉత్తమ సహాయ నటుడు – శివాజీ






