---Advertisement---

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు – పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు నిర్ణయం.

February 6, 2026

---Advertisement---

తెలంగాణ (Telangana) మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) జనసేన పార్టీ (Jana Sena Party) అడుగుపెట్టిన నేపధ్యంలో, ఆ పార్టీ అధినేత మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారం చేయనున్నారన్న వార్తలు రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చకు దారితీసాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో జనసేన పురపోరులోకి దిగడం చర్చనీయంశం అయింది. అయితే అనివార్య కారణాల వల్ల పవన్ కల్యాణ్ తెలంగాణలో చేపట్టాల్సిన మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

బీజేపీ(BJP)తో మైత్రి నేపథ్యంలో ఆయన ప్రచారం ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపుతుందని భావించినప్పటికీ, ఇటీవల తెలంగాణకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, ఎన్నికల భౌగోళిక పరిస్థితుల కారణంగా ప్రచారం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 336 వార్డుల్లో పోటీ చేస్తున్నప్పటికీ, పవన్ ప్రచారం రద్దు కావడం జనసేన–బీజేపీ శ్రేణుల్లో నిరాశను కలిగించింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో జనసేనకి మేలు చేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment