---Advertisement---

ఆధ్యాత్మిక క్షేత్రాలను ఆదిపత్య నిలయాలుగా మారుస్తున్న కూటమి నేతలు.

March 10, 2026

---Advertisement---

దేవాలయాలు (Temples) అనగానే ప్రశాంతత, భక్తి, ఆధ్యాత్మికత గుర్తుకు వస్తాయి. భగవంతుని సన్నిధిలో కాసేపు గడిపి మనసు ప్రశాంతత పొందడం కోసం భక్తులు ఆలయాలకు వెళ్తారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) ఏర్పడిన తరువాత కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు తమ రాజకీయా పోరాటాలకు నిలయాలుగా మారుతున్నాయనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. దేవాలయాలు భక్తి, ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా ఉండాల్సిన చోట రాజకీయ ఆదిపత్య ప్రదర్శనలకు వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల తిరువూరు నియోజకవర్గంలోని (Tiruvuru Constituency) గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన వేణుగోపాల స్వామి (Venugopala Swamy) కల్యాణోత్సవంలో (Kalyanotsavam) వివాదం (Controversy) చోటుచేసుకుంది. దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరియు ఎంపీ కేశినేని చిన్ని (MP Kesineni Chinni) వర్గాల మధ్య పట్టు వస్త్రాల సమర్పణ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో భక్తితో కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన సామాన్య భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్టు సమాచారం.

అలాగే కదిరి లక్ష్మీనరసింహ స్వామి (Kadiri Lakshmi Narasimha Swamy) రథోత్సవం కూడా రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. తెలుగుదేశం పార్టీ(TDP) ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ (Kandikunta Prasad) మరియు బీజేపీ(BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. రథోత్సవంలో పాల్గొనవద్దని విష్ణువర్ధన్ రెడ్డిపై (Vishnuvardhan Reddy) ఎమ్మెల్యే ఆంక్షలు విధించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పోలీసు జోక్యం చేసుకుని విష్ణువర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయడంతో భక్తి వాతావరణంలో జరగాల్సిన రథోత్సవం రాజకీయ ఉద్రిక్తతల మధ్య సాగినట్టు విమర్శలు వినిపించాయి.

విజయవాడలోని (Vijayawada) కనకదుర్గమ్మ ఆలయంలో (Kanaka Durga Temple) కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (Borra Radhakrishna) కుమారుడు డీలేష్ (Dileesh) తన స్నేహితులతో కలిసి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయం పైభాగంలో ఏర్పాటు చేసిన మహాకుంభాభిషేక వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ విధుల్లో ఉన్న ఆలయ ఉద్యోగి వేణు అనుమతి లేదని అడ్డుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిపై డీలేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడని, అనంతరం ఆలయ అధికారులు ఆ ఉద్యోగిని పిలిపించి మందలించి క్షమాపణ చెప్పించినట్టు సమాచారం. ఆలయంలో ఛైర్మన్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదనే విషయం ఉన్నప్పటికీ ఈ ఘటన భక్తుల్లో అసంతృప్తిని కలిగించిందని చెబుతున్నారు.

ఇక తిరుమల కేంద్రంగా కూడా కూటమి నేతల చేస్తున్న రాజకీయాలు సామాన్య ప్రజలకు దిగ్బ్రాంతిని కలిగిస్తున్నాయి, రాష్ట్రవ్యాప్తంగా ఆలయ పదవుల విషయంలో కూడా కూటమి పార్టీల నాయకుల మధ్య పోటీ, ఆధిపత్య ధోరణి కనిపిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాలను కూటమి పార్టీల రాజకీయ వేదికలుగా కాకుండా భక్తి, ఆధ్యాత్మికతకు నిలయాలుగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో ప్రశాంతత, ఆధ్యాత్మికత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment