బ్రిటీష్ వారి పాలన 1870లో, అప్పటి ప్రభుత్వము 10.1/3 చదరపు మైళ్లు (27.5 చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించింది.
అనంతరం 1965లో ఈ హక్కును తిరుమల తిరుపతి దేవస్థానాల పేరిట ప్రభుత్వము జీ.ఓ. నెం. 1784, తేదీః 01-11-1965 ద్వారా ధృవీకరించింది. 10.1/3 చదరపు మైళ్లు విస్తీర్ణం ని తిరుమల గ్రామంగా ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థాన సరిహద్దులు జీ.ఓ.నెం.1605, ఆదాయ శాఖ , తేదీ: 02-12-1975 ప్రకారం నిర్ణయించబడ్డాయి. (10.1/3 చదరపు మైళ్లు)
10.1/3 చదరపు మైళ్ల సరిహద్దు దాటి ఉన్న అటవి ప్రాంతం అటవీ శాఖ ఆధీనంలోని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించబడింది.
1986లో ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన చల్లా కొండయ్య కమీషన్ కూడా స్వామివారి ఆలయం చుట్టు ఉన్న 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం మాత్రమే తిరుమల క్షేత్రానికి మంజూరు అయిందని చెప్పారు.
జి.ఓ.నెం.311, రెవెన్యూ (ఎండోమెంట్స్–ఈ) శాఖ, తేదీ: 09-04-1990 ప్రకారం నిర్ణయించబడ్డ టీటీడీ రూల్ 196 చెప్పేది ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ 10 1/3 చదరపు మైళ్లు విస్తీర్ణంలో ఉన్న భూమి — పూర్తిగా టిటిడీ ప్రత్యేక అధీన ఆస్తిగా పరిగణించబడినట్టు చెప్పింది.
1993లో రాజ్యాంగాన్ని 73, 74వ సవరణల ద్వారా మార్చిన తరువాత దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థలు లేకపోవడం, ఎన్నికైన స్థానిక పాలనాయంత్రాంగం లేకపోవడం జరగడానికి వీలులేదని. పెద్ద ఊరయితే మునిసిపాలిటీ ఉండాలి, చిన్న ఊరయితే పంచాయితీ ఉండాలి. పంచాయితీకి తగినంత జనాభా లేనట్లయితే పక్కనున్న ఏదైనా గ్రామ పంచాయితీలో భాగం చేయాలి. అంతే తప్ప స్థానిక సంస్థ ఏదీలేని మానవ ఆవాసం ఉండడానికి వీలులేదని స్పష్టం చేసింది భారత ప్రభుత్వం.
రాజ్యంగ సవరణ ప్రకారం తిరుమల గ్రామంలో పంచాయతి ఎన్నికలు జరగాలని నాటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు 2005లో హైకోర్టులో కేస్ వేయించారు.
తిరుమల పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మికం తప్ప రాజకీయం ఉండకూడదని 2005న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న జేసి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యంలో వైయస్సార్ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జీఓ విడుదల చెసింది (జీవో నెంబర్ 338). ఆ జీవో ప్రకారం 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతంలో ఉన్న తిరుమల గ్రామంలో ఎలాంటి రాజకీయాలకి అనుమతిలేదని.
ఈ జీవో నెంబర్ 338ని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి, వైయస్సార్ 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణం వరకే తిరుమలను కుదించి ఏడు కొండలని రెండు కొండలుగా చేశారని ప్రచారం అందుకున్నారు.
ప్రతిపక్షాలు మాటలు నమ్మి కొంత మంది సాదువులు, హిందూ వాదులు 2006 జులై 15న నిరసన వ్యక్తం చేస్తూ వారు తిరుమల విస్తీర్ణం కిలో మీట్లర్లలా కాకుండా ఏడు కొండలు శ్రీవారివే అని మార్చి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
27 జులై 2006న టీటీడీ అదారిటి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తు తిరుమలను 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణం లా కాకుండా అటవితో సహా అంత కలిపి 332 చదరపు కిలో మీటర్ల ప్రాంతం అని కొత్త జీవో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరరు కోరారు.
27 జులై 2006న ప్రభుత్వ కెబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవి ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని కెంద్ర ప్రభుత్వానికి అటవిని డీనోటిఫై చేయమని లేఖ రాసింది.
కెంద్ర ప్రభుత్వం నుండి అనుమతి రాగానే 2007 జూన్ 2న 332 చదరపు కిలో మీటర్ల ప్రాంతంలో ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిచిన పవిత్ర ప్రదేశం అని జీవో నెంబర్ 746ని విడుదల చేశారు వైయస్సార్ (తిరుమల చరిత్రలో 7 కోండలు శ్రీవారివే అని ప్రభుత్వ అధికార ముద్ర తోలిసారి వేసింది వైయస్సార్ గారే)
ఆ జీవోతో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 జీవోని కూడా విడుదల చేశారు వైయస్సార్.
వైయస్సార్ ఇచ్చిన జీవోతో 1870 బ్రిటీష్ పాలన నుండి అధికారికంగా లేని ఏడు కొండ్లను శ్రీవారికి చేందేలా అయ్యాయి.






