---Advertisement---

తిరుమల క్యూ లైన్ లో భక్తురాలిని కాటేసిన పాము

February 23, 2026

---Advertisement---

డెస్చ్రిప్తిఒన్: తిరుమల (Tirumala)లో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఒక భక్తురాలు పాముకాటుకు (Snake Bite) గురైన సంఘటన కలకలం రేపింది. దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం (Rs.300 Special Entry Darshan) క్యూలైన్లో (Queue Line) భక్తులు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

తెలంగాణకు (Telangana) చెందిన 27 ఏళ్ల మౌనికను (Mounika) పాము కాటు వేసినట్టు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) సిబ్బంది ఆమెను అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అయితే తిరుమలలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆందోళనకు దారితీస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనార్థం చేరుకుంటున్న నేపథ్యంలో క్యూ లైన్ల వద్ద భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తుల భద్రత కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వ హయాంలో భక్తుల రక్షణపై నిర్లక్ష్యం పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలను కేంద్రంగా చేసుకుని అవాంఛనీయ ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండడం దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర భద్రతా చర్యలు తక్షణమే చేపట్టాలని, క్యూ లైన్ల పరిశుభ్రత మరియు పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment