---Advertisement---

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.

February 8, 2026

---Advertisement---

తిరుమల (Tirumala) మొదటి ఘాట్ రోడ్డు (First Ghat Road)లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో మలుపు వద్ద వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్, ఎదురుగా ఉన్న బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసమవ్వగా, బైక్(Bike) నడుపుతున్న వ్యక్తికి కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదం కారణంగా కొంతసేపు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బైక్, బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment