---Advertisement---

తిరుమల లడ్డు అంశం – తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు కోర్టు నోటీసులు

February 20, 2026

---Advertisement---

తిరుమల లడ్డు (Tirumala Laddu) అంశంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలతో పాటూ మీడియా వర్గాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కొత్త మలుపు తిరిగింది. విజయవాడ సివిల్ కోర్టు (Vijayawada Civil Court), తిరుమల లడ్డూ విషయంలో ప్రసారం అవుతున్న కొన్ని వార్తా కథనాలు భక్తుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆరోపణలపై స్పందిస్తూ సంబంధిత మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అనుకూల మీడియా తిరుమల లడ్డులో జంతు కొవ్వులు, రసాయనాలు కలిసాయంటూ పదేపదే చర్చలు నిర్వహించడం వల్ల శ్రీవారి భక్తుల్లో ఆందోళన నెలకొంటోందని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ (Shravan Kumar) పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈ డిబేట్లు అనవసర రాద్ధాంతానికి దారితీస్తున్నాయని, వాటిని నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు.

అదేవిధంగా, తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సంబంధిత అధికారిక నివేదికలు స్పష్టం చేసినప్పటికీ, కొన్ని ఛానెళ్లు నిరంతరం చర్చలు నిర్వహించడం మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని చింతా వెంకటేశ్వర్లు సీనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన విజయవాడ కోర్టు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా (Media) సంస్థలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తూ, తిరుమల లడ్డు అంశంపై జరుగుతున్న డిబేట్లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment