---Advertisement---

తిరుమలలో సంచలనం… టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలు, రాజీనామా డిమాండ్

March 1, 2026

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) చైర్మన్ బీఆర్ నాయుడుకు (B R Naidu) సంబంధించిన కొన్ని వీడియోలు (Videos), ఫోటోలు (Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ఈ దృశ్యాలు బయటకు వచ్చిన నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వ్యక్తి టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

94 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనైతిక చర్యలకు పాల్పడిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే నైతిక బాధ్యతగా బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవుడితో ఆటలాడరాదని, ఇది భగవంతుడు విధించిన తీవ్రమైన శిక్షగా భావించాలన్నారు.

ఇక మరోవైపు అధికార పక్షం మాత్రం ఈ వీడియోలు ఫేక్ అంటూ బీఆర్ నాయుడిని సమర్థిస్తోంది. అయితే ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌కు చెందిన గ్రోక్ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ఇది డీప్ ఫేక్ కాదని, అసలైన వీడియోనేనని పేర్కొన్నట్టు వార్తలు వెలువడటం మరింత సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో భక్తులు బీఆర్ నాయుడు (B R Naidu) తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదం ముదురుతున్న వేళ, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ప్రతిచర్యలకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment