---Advertisement---

నామినేషన్ దాఖలు చేసిన ఉదయనిధి, విజయ్..తమిళనాడులో రాజకీయ వేడి

April 2, 2026

---Advertisement---

తమిళనాడు ఎన్నికల (Tamil Nadu Elections) నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. చెపాక్ తిరువల్లికేని నియోజకవర్గం (Chepauk–Triplicane Constituency) నుంచి పోటీ చేయడానికి డీఎంకే అభ్యర్థిగా ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో కూడా ఇదే స్థానంలో పోటీ చేసి విజయం సాధించిన ఆయన, మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన 2024 సెప్టెంబర్ 28న ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2022 డిసెంబర్ 14 నుంచి కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.

విజయ్ రోడ్ షో హంగామా.. కేసులు, వివాదాలు

టీవీకే (TVK) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ (Vijay) తిరుచిరాపల్లిలో నామినేషన్ (Tiruchirappalli Nomination) దాఖలు చేసేందుకు వెళ్లే సమయంలో భారీ రోడ్ షో (Road Show) నిర్వహించారు. త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం (Trichy East Constituency) నుంచి పోటీ చేస్తున్న ఆయన ఇప్పటికే మార్చి 30న పెరంబూర్ (Perambur) నుంచి కూడా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టమైంది.

మార్చి 30న జరిగిన ర్యాలీలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు వెలువడ్డాయి. 30 లౌడ్ స్పీకర్ల వినియోగం, అంబులెన్స్‌కు (Ambulance) దారి ఇవ్వకపోవడం, 5000 మందికి పైగా జనాన్ని సమీకరించడం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవాళ కూడా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ విజయ్ మరోసారి రోడ్ షో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆయన పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ప్రత్యేకతగా నిలుస్తోంది.

తన అఫిడవిట్‌లో విజయ్ రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment