---Advertisement---

మళ్లీ వస్తున్న మ్యాజిక్: వెంకటేష్–త్రివిక్రమ్ కాంబో రీ ఎంట్రీ!

February 17, 2026

---Advertisement---

ప్రేక్షుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కుటుంబ కథా చిత్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేవి నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరీ. ఆ చిత్రాల విజయానికి కథా రచయితగా పని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం (House No. 47)’పై ఇప్పటికే టాలీవుడ్‌లో హైప్ మొదలైంది. వెంకీ మార్క్ కామెడీ టైమింగ్‌కు గురూజీ పదునైన డైలాగులు జతకానుండటంతో ఈ సినిమా మరో క్లాసిక్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెకండ్ హాఫ్‌లో యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్‌తో పాటు వెంకటేష్ పాత్రకు సంబంధించిన ఓ భావోద్వేగ ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment