---Advertisement---

విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నకు ప్రధాని ప్రత్యేక ఆశీస్సులు!

February 25, 2026

---Advertisement---

సినీ జంట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మరియు రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం ముందురోజే ప్రత్యేకంగా నిలిచింది. వారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యక్తిగతంగా లేఖ రాసి ఆశీర్వాదాలు అందించారు. ఈ పెళ్లికి తనను ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ వివాహం వారి జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభమని, సప్తపది బంధంతో జీవితాంతం మంచి స్నేహితులుగా, అన్యోన్య దంపతులుగా ఉండాలని ఆశించారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ప్రేమ, పరస్పర గౌరవంతో జీవితం నిర్మించుకోవాలని సూచించారు.

వారి భవిష్యత్‌ ప్రయాణం ఆనందంగా, అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ఆశీస్సులు అందించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్లో ఈ వివాహ వేడుక ఘనంగా జరగనుంది

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment