టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)–రష్మిక మందన్నా (Rashmika Mandanna) పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న జరగనున్న గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందు ప్రీ-వెడ్డింగ్ సంబరాలు సందడి చేస్తున్నాయి. సన్నిహితుల మధ్య మోడ్రన్ స్టైల్లో నిర్వహించిన సన్‌లైట్ పూల్ పార్టీ వేడుకలు ఫుల్ ఫన్ మూడ్‌లో సాగాయి.
ఫ్రెండ్స్‌తో కలిసి పూల్ వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపిన క్షణాలను విజయ్ సోషల్ మీడియాలో పంచుకోగా, కాండిల్‌లైట్ డిన్నర్లో గోల్డెన్ లైటింగ్ మధ్య మెరిసిన సన్నివేశాలను రష్మిక షేర్ చేసింది. అభిమానులు పెట్టిన జంట పేరు “విరోష్” (Virosh) థీమ్‌తో ప్రత్యేక అలంకరణలు వేడుకలకు మరింత ప్రత్యేకతను తెచ్చాయి.
ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్స్‌కు వేదికగా నిలిచిన ఐటీస్ మీమోంటోస్ ఉదయ్ పూర్ లో గార్డెన్ థీమ్ డెకర్ ఆకట్టుకుంది. బ్లష్ పింక్ లిల్లీస్, గ్రీన్ హైడ్రేంజియాలతో అలంకరించిన డిన్నర్ టేబుల్, తాజా పండ్ల డెకరేషన్, జపనీస్ వంటకాలతో సిద్ధం చేసిన లగ్జరీ మెనూ కార్డ్ హైలైట్‌గా నిలిచాయి.
ప్రతి సీటింగ్ వద్ద సేజ్ గ్రీన్ నాప్కిన్పై “VIROSH” ఎంబ్రాయిడరీతో పర్సనల్ టచ్ ఇచ్చారు. ఫిబ్రవరి 24న మెహందీ, 25న హల్దీ మరియు సంగీత్ వేడుకలు జరగనుండగా, 26న జరిగే వివాహ మహోత్సవం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






