---Advertisement---

విశాఖలో సంచలనం…ప్రియురాలిని హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి

March 30, 2026

---Advertisement---

విశాఖ నగరంలో (Visakhapatnam) ఒక ఘోర హత్య కేసు వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. నేవీ ఉద్యోగిగా (Navy Employee) పనిచేస్తున్న వ్యక్తి తన స్నేహితురాలిని హత్య చేసి, మృతదేహాన్ని (Dead body) ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో (Fridge) దాచిన దారుణ ఘటన ఎల్ వీ నగర్ ప్రాంతంలో (LV Nagar) చోటుచేసుకుంది.

గొడవతో మొదలైన వివాదం.. హత్యగా మారిన ఘటన

విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (Chintada Ravindra) 35 సంవత్సరాలు, విశాఖపట్నంలో నేవీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎల్ వీ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. అతని భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన నేపథ్యంలో, విశాఖకు చెందిన మౌనిక (Mounika) 29 సంవత్సరాల యువతితో ఉన్న పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.

ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్న రవీంద్రతో ఆమెకు వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి లోనైన రవీంద్ర ఆమెను హత్య చేశాడు.

హత్య అనంతరం సాక్ష్యాలను చెరిపివేయడానికి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని రెండు సంచుల్లో కట్టి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా శరీర భాగాలు లభించాయి. అయితే తల భాగం మాత్రం ఇంకా కనుగొనాల్సి ఉంది.

నేరానికి పాల్పడిన అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. యువతి తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ వేధింపులు భరించలేకే ఈ చర్యకు పాల్పడ్డానని పోలీసులకు తెలిపాడు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహ భాగాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తల భాగం కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment