---Advertisement---

నేటి మధ్యాహ్నం 2 గంటలకు జగన్ ప్రెస్ మీట్

February 19, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారు నేడు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ప్రెస్ మీట్ (Press Meet) రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో అంబటి రాంబాబు (Ambati Rambabu) మరియు జోగి రమేష్ (Jogi Ramesh) నివాసాలపై జరిగిన దాడుల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని ఇప్పటికే విమర్శించిన జగన్(Jagan) గారు, ఆ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు మరిన్ని ముఖ్యమైన విషయాలపై స్పందించే అవకాశం ఉందని సమాచారం.

ప్రత్యేకంగా తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారంలో సీబీఐ(CBI) నివేదికలో జంతు కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడైన నేపథ్యంలో, తన వాదనకు దర్యాప్తు సంస్థ సమ్మతించినట్లు చెప్పే అవకాశం ఉంది. అలాగే హెరిటేజ్ సంస్థ (Heritage company)కు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ (Indapur Dairy)కి అధిక ధరలకు నెయ్యి టెండర్ కట్టబెట్టారనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించే అవకాశముంది.

రాష్ట్ర బడ్జెట్ విషయంలో కూటమి ప్రభుత్వం అంకెల గారడీకి పాల్పడిందనే విమర్శలపై వాస్తవ గణాంకాలతో వివరణ ఇవ్వాలని జగన్ గారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదనంగా, మహిళల భద్రత అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశముందని సమాచారం. ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు నాంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment