ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నిర్వహించిన డీఎస్సీ నియామకాల (DSC Recruitments) వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) డీఎస్సీ నియామకాలపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ (Mega DSC) పేరుతో 16 వేల టీచర్ పోస్టుల భర్తీ చేపట్టిందని చెప్పినా.. వాస్తవానికి ఇది భారీ అవినీతి కుంభకోణంగా (Corruption Scam) మారిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సీబీఐ విచారణ (CBI Investigation) జరపాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించిన జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కుట్రల కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు (Candidates Future) ప్రమాదంలో పడిందని విమర్శించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా దెబ్బతిందని, ఫలితాల ప్రకటన నుంచి మెరిట్ లిస్ట్ (Merit List) వరకు అనేక అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ భద్రతా వ్యవస్థలను కావాలనే నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఒకే అధికారికి (Single Officer) అప్పగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అంతేకాకుండా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు (Outsourcing Employees) గోప్యమైన బాధ్యతలు అప్పగించడం కూడా తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తిస్తోందని తెలిపారు.
ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో (Question Papers Preparation Proces) పాల్గొన్న ఒక ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ (First Rank) సాధించడం పేపర్ లీక్ (Paper Leak) అనుమానాలను మరింత బలపరుస్తోందని జగన్ ఆరోపించారు. ఇది సాధారణ విషయం కాదని, మొత్తం నియామక ప్రక్రియపై అనుమానాలు పెరిగేలా చేసిందన్నారు.
డీఎస్సీ మెరిట్ లిస్టులో మార్పులు జరిగాయని, కొంతమంది అభ్యర్థుల పేర్లు తొలగించబడ్డాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని జగన్ తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Certificate Verification) పూర్తయిన తర్వాత కూడా కొందరి పేర్లు తుది ఎంపిక జాబితాలో లేకపోవడం వెనుక భారీ అక్రమాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
స్పోర్ట్స్ కోటా (Sports Quota) విధానాన్ని మధ్యలో మార్చి.. తిరిగి పాత విధానానికే తీసుకురావడం వెనుక కూడా అనేక సందేహాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో బ్యాక్‌డోర్ ఎంట్రీలకు (Backdoor Entries) అవకాశం కల్పించారని విమర్శించారు.
టీచర్ పోస్టుల కోసం డబ్బుల బేరసారాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని జగన్ మండిపడ్డారు. పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారని, అసలు నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు బయటకు రావాలంటే స్వతంత్ర సీబీఐ(CBI) దర్యాప్తే ఒక్కటే మార్గమని జగన్ స్పష్టం చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శిస్తూ.. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.






