---Advertisement---

భీమవరం పర్యటనలో వైఎస్ జగన్… పెదఅమిరం వివాహ వేడుకకు హాజరు

February 5, 2026

---Advertisement---

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) భీమవరం (Bhimavaram) బయలుదేరారు. కొద్దిసేపట్లో పెదఅమిరం చేరుకుని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు (Koyye Moshen Raju) కుమారుడి వివాహ వేడుకలో పాల్గొననున్నారు.

రేపు ఇబ్రహీంపట్నంలో పరామర్శ కార్యక్రమం

టీడీపీ(TDP) గూండాల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కుటుంబాన్ని ఈ నెల 6న వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment