ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత Y. S. Rajasekhara Reddy చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ తన సందేశంలో ఆ పాదయాత్రను రాష్ట్ర చరిత్రను మార్చిన ఉద్యమంగా అభివర్ణించారు. 2003 ఏప్రిల్ 9న ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి చేపట్టినదని, అది ప్రజల్లో విశ్వాసం నింపిందని గుర్తు చేశారు.
పాదయాత్రతో మారిన రాజకీయ దిశ
ఈ పాదయాత్ర ప్రజలకు “నేనున్నాను” అనే భరోసా కల్పించిందని జగన్ తెలిపారు. ప్రజలు భారీ మద్దతు ఇవ్వడంతో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ (Free Electricity) అందించే ఫైల్‌పై తొలి సంతకం చేసి ఉపశమనం కల్పించారని అన్నారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని, రైతులకు (Farmers’) బలం చేకూర్చడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం వంటి చర్యలు ప్రజల జీవితాల్లో కీలక మార్పు తీసుకువచ్చాయని జగన్ వివరించారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తీసుకున్న సంస్కరణలు పేద పిల్లలకు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలను కల్పించాయని తెలిపారు. ముఖ్యంగా Polavaram Project వంటి ప్రాజెక్టులకు వేగం తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
తన తండ్రి వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్న జగన్, ఆ పాదయాత్ర స్ఫూర్తితో తన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన… pic.twitter.com/B8HvVZwFah
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2026






