హారర్ కామెడీ సినిమాలకు కొత్త ట్రెండ్ సెట్ చేసిన కాంచన ఫ్రాంచైజీ మరోసారి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. రాఘవ లారెన్స్(Raghava Lawrence) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంచన – 4(Kanchana 4) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన 3 భాగాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించగా.. ఇప్పుడు అంతకుమించిన క్రేజీ కాంబినేషన్‌తో 4వ భాగాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు లారెన్స్ సిద్ధమవుతున్నారని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన అతిపెద్ద సర్‌ప్రైజ్ ఏమిటంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించబోతున్నారట. కథను పూర్తిగా మలుపు తిప్పే ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నయనతార కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. కాంచన లాంటి భారీ హారర్ ఫ్రాంచైజీలో (Horror Franchise) నయన్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
అంతేకాదు.. ఈ సినిమాలో మరో 2 గ్లామరస్ హీరోయిన్లు కూడా ప్రేక్షకులను అలరించబోతున్నారట. మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే(Pooja Hegde) నటించనున్నట్లు సమాచారం. గ్లామర్‌తో పాటు కథలో కీలక ప్రాధాన్యత ఉన్న పాత్రను ఆమె పోషిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ (Nargis Fakhri) కూడా సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నయనతార, పూజా హెగ్డే, నర్గిస్ ఫక్రీ ముగ్గురు కలిసి నటించనున్నారనే వార్తతో కాంచన – 4కు దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ కాస్టింగ్ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ తీసుకురావచ్చని చెబుతున్నారు.
సాధారణంగా కాంచన సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు ఎమోషన్, హారర్, సెంటిమెంట్ కలయికగా ఉంటాయి. ఈసారి ఆ ట్రాక్‌ను నయనతారతో తెరకెక్కించాలనే లారెన్స్ ప్లాన్ సినిమాకు అతిపెద్ద హైలైట్ కానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు పూజా హెగ్డే, నర్గిస్ ఫక్రీ గ్లామర్ కూడా జతకావడంతో ఈ సినిమా గత రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
త్వరలోనే ఈ క్రేజీ కాస్టింగ్‌పై, షూటింగ్ షెడ్యూల్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.






