ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027కు (ICC Men’s ODI World Cup-2027) ఇంకా ఏడాది సమయం ఉండగానే టికెట్లకు (Tickets) భారీ డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ 1, 2026న టికెట్ బ్యాలెట్ ప్రారంభమైనప్పటి నుంచి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఐసీసీ(ICC) తెలిపింది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మ్యాచ్‌కు లక్షకు పైగా అప్లికేషన్లు రావడం విశేషం.
అక్టోబర్ 10, 2027న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా-భారత్ మ్యాచ్‌కు 86,000కు పైగా, భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు 80,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. నవంబర్ 7న జరగనున్న మరో భారత్-పాక్ మ్యాచ్‌కు దాదాపు 75,000 అప్లికేషన్లు నమోదయ్యాయి. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఫైనల్ టికెట్ల కోసం సుమారు 65,000 మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రపంచకప్ టికెట్ల ప్రారంభ ధర 9.62 అమెరికన్ డాలర్లు కాగా, కీలక మ్యాచ్‌లకు గరిష్ట ధర 31.31 డాలర్లుగా నిర్ణయించారు. కుటుంబాలు, విద్యార్థులు, పెన్షనర్లు, స్థానికులు, కమ్యూనిటీ క్లబ్‌లు, పాఠశాలల బృందాలకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించే ఈ 14వ వన్డే ప్రపంచకప్ 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది. కేవలం 48 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ దరఖాస్తులు రావడం టోర్నీపై ఉన్న భారీ అంచనాలను చూపిస్తోందని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా (Sanjog Gupta) తెలిపారు.








